నమస్తే🙏 మేక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్త
మేక పిల్లల్లో ఊసరవెల్లి రోగం లేదా తీపి రోగం
జీవాలు లేదా మేకల పెంపకంలో ఎక్కువగా తరచుగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి రోగాలలో ఇది ఒకటి ఊసరవెల్లి రోగం లేదా తీపి రోగం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా దీనిని పిలవడం జరుగుతుంది దీనిని అరికట్టక పోయినట్లయితే ఎక్కువగా పిల్లలు చనిపోయి నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది.
మేక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఊసరవెల్లి రోగంలో వాడాల్సిన మెడిసిన్
మేక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఊసరవెల్లి రోగంలో వాడాల్సిన మెడిసిన్
video link:
https://youtu.be/DTP8fB7ty4Q?si=DOkWEjwJOKHsxpGN
live experience
👉 లక్షణాలు :
ఇది ఎక్కువగా మేకపిల్లల్లో కనబడే లక్షణం ఈ రోగం పుట్టిన నాలుగు రోజుల నుండి వారం రోజుల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది వచ్చిన పిల్లల్లో భూమిని పట్టుకుని లేవకపోవడం, ఊగడం సోల్గడం మరియు నిలబడ నిలబడడానికి ఓపిక లేకుండా బలహీనంగా ఉండడం పాలు తాగకుండా చిక్కిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇవి తరచుగా “ఊసరవెల్లి వలె ఊగడం” జరుగుతుంది ముఖ్య లక్షణం, ఈ లక్షణాలతో పాటు మేక పిల్లల కాళ్ళు బలహీనంగా ఉండి నిలవడం లేని పరిస్థితిలో ఉంటాయి.
👉 కారణాలు :
జీవాలు లేదా మేకలు చూడుతో ఉన్నప్పుడు బలమైన పోషకాలు కలిగి దానాలు లేదా మేతను ఇవ్వడం వల్ల పుట్టబోయే పిల్లలు మంచి దృఢంగా పుడతాయి ,కానీ ఇవ్వకపోవడం వల్ల ఇలా బలహీనంగా పుట్టడం జరుగుతుంది ఇటువంటి పిల్లలకు ఈ ఊసరవెల్లి రోగం రావడానికి గల కారణం.
👉 నివారణ :
ఈ రోగం రాకుండా ముందస్తుగా జీవాలకు చూడు తో ఉన్నప్పుడు మంచి బలమైన టానిక్స్ ఇవ్వాలి ఉదాహరణకు మల్టీ విటమిన్ తోని లేదా బి కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్ ఇవ్వాలి. తద్వారా పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా పుడతాయి.
👉 చికి2త్స :
ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లలకు మల్టీ విటమిన్ టానిక్స్ ఇవ్వాలి దానితో పాటుగా పెన్సిలిన్ యాంటీబయాటిక్ capsule మందులు ఇవ్వాలి
Medication:/మందులు
ఉదాహరణకు:
multi star liquid,
vimral liquid
chloramphenicol capsules.